ETV Bharat / state

'ఏఎన్​యూ వీసీ తీరుపై గవర్నర్​కు ఫిర్యాదు చేస్తాం'

ఆచార్య నాగార్జున వర్శిటీ ఉపకులపతి తీరుపై గవర్నర్​కు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి నక్కా ఆనంద్​ బాబు తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థుల సస్పెన్షన్​ను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలు, తెదేపా నేతలతో ఏఎన్​యూ అధ్యాపక బృందం చర్చలు జరిపింది. విద్యార్థులపై విధించిన సస్పెండ్ ఉత్తర్వులను రద్దు చేసినట్లు అధ్యాపకులు నేతల దృష్టికి తీసుకెళ్లారు.

author img

By

Published : Feb 3, 2020, 3:57 PM IST

తెదేపా నేతలతో చర్చలు జరిపిన ఏఎన్​యూ అధ్యాపక బృందం

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న అణచివేత ధోరణలు, అరాచకాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. వర్శిటీ విద్యార్థుల సస్పెన్షన్​ను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలు, తెదేపా నేతలతో ఏఎన్​యూ అధ్యాపక బృందం చర్చలు జరిపింది. ఇప్పటికే విద్యార్థులపై విధించిన సస్పెండ్ ఉత్తర్వులను రద్దు చేశామని నేతల దృష్టికి అధ్యాపకులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్​ బాబు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై చర్యలు తీసుకునే ముందు ఉపకులపతి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీసీ వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్​కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించటానికి వెనుకాడబోమని అధ్యాపకులకు తేల్చి చెప్పారు. తెదేపా నేతలు లేవనెత్తిన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధ్యాపకులు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: ఏఎన్‌యూ విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.