ETV Bharat / state

'ఏంటీ పోస్టులు.. బతికుండగానే చంపేస్తారా' - చంద్రబాబుపై పోస్టులు చేసిన వారిపై వర్ల రామయ్య ఫిర్యాదు

తెదేపా అధినేత చంద్రబాబునాయుడుపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేయాలంటూ.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

varla ramaiah complaint on social media posts on chandrababu
చంద్రబాబుపై పోస్టులు చేసిన వారిపై వర్ల రామయ్య ఫిర్యాదు తాజా వార్తలు
author img

By

Published : Mar 18, 2020, 8:16 AM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేసిన మధుసూధన్​రెడ్డి, చిన్నప్ప అనే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని.. తెదేపా నేతలు మంగళగిరి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి గ్రామీణ పోలీసులను కలిసి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డిపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని 15 రోజుల్లోనే అరెస్టు చేశారని వర్ల పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తమ అధినాయకుడిపై అసత్య ప్రచారాలు చేస్తూ.. ఫొటోలు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబుపై పోస్టులు చేసిన వారిపై వర్ల రామయ్య ఫిర్యాదు తాజా వార్తలు

ఇవీ చదవండి.. స్థానిక ఎన్నికల వాయిదాపై నేడు సుప్రీంలో విచారణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.