ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు కొందరు వైకాపా నేతలు చంద్రబాబుని నిందించటం, అసత్యాలతో ప్రజల్ని నమ్మించటం మంత్రిపదవికి అర్హతలుగా భావిస్తున్నారని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ దుయ్యబట్టారు. వైకాపా పాలనలో ప్రజలు లోపాలు గుర్తిస్తున్నారని గ్రహించినప్పుడల్లా... వారి దృష్టి మళ్లించేందుకు ఎస్సీల భూముల పేరిట ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అసత్యాన్ని తెరమీదకు తెస్తున్నారని మండిపడ్డారు. అనేక విచారణలు జరిపించినా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు స్పష్టం చేసిందని చెప్పారు.
మీడియాలో ఏదోరకంగా ఉండాలనే వ్యక్తిత్వం ఎమ్మెల్యే ఆర్కేదని.. అమరావతిని రాజధానిగా ప్రకటించనప్పటి నుంచి నేటి వరకు అనేక అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారని శ్రావణ్ కుమార్ ఆక్షేపించారు. ఎస్సీలు ఎక్కువగా ఉన్న రాజధానిలో 4 నెలల నుంచి పింఛన్ ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలపై వారికున్న వ్యతిరేకత చాటుకునేలా ఆ వర్గానికి చెందిన కాంతిలాల్ దండే, కోన శశిధర్‌లపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
Disha App: ఆపదలో యువతి.. దిశ యాప్‌తో 100కు కాల్.. ఆ తర్వాతేమైంది?