వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బడుగు బలహీన వర్గాల వారికి రక్షణ కరవైందని తెదేపా నేత, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. పల్నాడు ప్రాంతంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు పెరిగిపోయాయన్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని మండిపడ్డారు.
వైకాపా నేతలు కులతత్వాన్ని పెంచి పోసిస్తున్నారన్నారని శ్రావణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల అంశం తెరపైకి వచ్చిన నాటి నుంచి.. విశాఖపట్నంలో భూకబ్జా, భూ దందాలు పెరిగిపోయన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలను కావాలనే లబ్దిదారులకు ఇవ్వడం లేదన్నారు. సంక్రాంతి పండుగ లోగా లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకపోతే తామే గృహాలను లబ్ధిదారులకు అందచేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: