వైకాపా నేత జోగి రాజా... సామాజిక మాధ్యామాల్లో తనను దూషిస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా బాపట్ల నియోజకవర్గ ఇంఛార్జ్ నరేంద్రవర్మరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో కలిసి బాపట్ల పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జోగి రాజాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా నేతల అక్రమాలను ప్రశ్నిస్తే... సామాజిక మాధ్యామాల్లో పరువుకు భంగం కలిగేలా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: