దళిత సంఘాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం... తిరిగి దళితులపైనే కేసులు పెట్టడం దారుణమని తెదేపా రాష్ట్ర కార్యదర్శి మనుకొండ శివప్రసాద్ అన్నారు. వైద్యుడు సుధాకర్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ గుంటూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సుధాకర్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని త్వరలోనే కార్యాచరణ రూపొందించి ఉద్యమానికి శ్రీకారం చూడతామన్నారు.
వైకాపా ప్రభుత్వంలో దళితలకు రక్షణ లేకుండా పోయిందని.. అందుకు వైద్యుడు సుధాకర్ నిదర్శనమన్నారు. ఇకనైనా ప్రభుత్వం దళితలకు రక్షణ కల్పించాలన్నారు. లేకపోతే త్వరలోనే దీనిపై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇది చదవండి: దారుణం: భార్యను సజీవంగా పూడ్చిపెట్టిన భర్త!