ETV Bharat / state

సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ వద్ద ఉద్రిక్తత.. కోడెల శివరాం నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా నాయకుల ఆందోళన - కోడెల శివరాం పాదయాత్ర

Kodela Shivaram: మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ తనయుడు, తెదేపా నేత కోడెల శివరాం 'చంద్రన్న ఆశయ సాధన' పేరుతో పాదయాత్ర చేపట్టారు. పేరేచర్ల-కొండమోడు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన పాదయాత్ర చేపట్టారు. సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రకు బయల్దేరిన ఆయనను పోలీసులు అడ్డుకుని.. నిర్బంధించారు.

శివరాం పాదయాత్ర
శివరాం పాదయాత్ర
author img

By

Published : Feb 19, 2022, 10:04 AM IST

Updated : Feb 19, 2022, 11:08 AM IST

Kodela Shivaram: గుంటూరు జిల్లా పేరేచర్ల - కొండమోడు రహదారి విస్తరణ పనులు వెంటనే చేపట్టాలంటూ తెదేపా నేత కోడెల శివరాం పాదయాత్రకు సిద్ధమయ్యారు. రాజుపాలెం నుంచి దేవరంపాడు గుడి వరకు పాదయాత్ర చేయనున్నారు. 'చంద్రన్న ఆశయ సాధన' పేరుతో శివరాం ఈ పాదయాత్రకు పిలుపునిచ్చారు.

సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న శివరాం.. పార్టీ కార్యాలయంలో తెదేపా జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్, కోడెల విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం పాదయాత్రకు బయల్దేరుతున్న శివరామ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయంలోనే ఆయనను నిర్బంధించారు. దీంతో ఎన్టీఆర్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కోడెల శివరాం నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా నాయకుల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెదేపా నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో బైఠాయించి తెదేపా నాయకుల ధర్నా చేపట్టారు. నిరనసకు దిగిన తెదేపా నాయకులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్​కు తరలించారు.

తెల్లవారుజాము నుంచే సత్తెనపల్లిలోని కోడెల నివాసం, తెదేపా కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పాదయాత్రకు వెళ్లకుండా రాజుపాలెం తెదేపా నేత నరసింహారావుతో పాటు పలువురిని గృహనిర్బంధం చేశారు. పాదయాత్రలో భాగంగా దేవరంపాడు వద్ద తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన భోజన ఏర్పాాట్లను పోలీసులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి

Power Cut: రైతుకు కరెంట్‌ షాక్‌.. పొలాల్లో అన్నదాతల పడిగాపులు

Last Updated : Feb 19, 2022, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.