రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. తమ పార్టీ అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు విపరీతంగా పెరిగిపోయానని ఆరోపించారు. సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం అభివృద్ధి కుంటు పడిందన్నారు. యథేచ్ఛగా గూండాయిజం, రౌడీయిజం చేస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపులతో గెలవాలనుకోవడం అధికారపార్టీ నేతలకు కలగానే మిగిలిపోతుందన్నారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మైనింగ్ మాఫియా దందా కొనసాగిస్తున్నారని ఆంజనేయులు ఆరోపించారు. నిధులు తీసుకురావడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారన్నారు. మార్చి 10న జరగనున్న పురపాలక ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే.. తమ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: