ETV Bharat / state

కోర్టు ఉత్తర్వులున్నా ఎలా కూల్చేస్తారు: మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు - guntur latest news

కోర్టు ఉత్తర్వులు ఉన్నా వినుకొండలోని సురేశ్ మహల్ రోడ్డులో ఇళ్లను కూల్చడంపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్వార్థ ప్రయోజనాలకు తొత్తుగా పని చేస్తున్న కమిషనర్​ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అఖిలపక్షంతో కలిసి పోరాడతామని అన్నారు.

tdp leader gv anjaneyulu
tdp leader gv anjaneyulu
author img

By

Published : Jul 16, 2021, 2:22 PM IST

గుంటూరు జిల్లా వినుకొండలోని సురేశ్ మహల్ రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకు తెదేపా తరఫున పోరాడతామని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఇందుకోసం అఖిలపక్షాలతో కలిసి ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ.. రెండు రోజుల క్రితం అధికార యంత్రాంగంతో కలిసి నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ తొలగించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని అతిక్రమించడమే కాక, స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీస్, రెవిన్యూ, విద్యుత్ శాఖల అధికారులను తప్పుదోవ పట్టించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడిన కమిషనర్ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే కమిషనర్​ని విధుల నుంచి తొలగించి.. నివాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని అన్నారు.

ఇదీ చదవండి:

కరోనా కట్టడి కోసం సీఎంలకు మోదీ '4T ఫార్ములా'!

Sbi Alert: ఎస్​బీఐ వినియోగదారులకు హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.