ఇదీ చదవండి: జైలు నుంచి విడుదల కానున్న చింతమనేని
"కోడెల ఆత్మహత్యకు అదే కారణం!" - latest press meet of devineni
తెదేపా నాయకులపై తప్పుడు కేసులు పెట్టడమే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం వైఖరి ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు.
'తెదేపా నాయకులపై తప్పుడు కేసులే వైకాపా ధ్యేయం'
తెదేపా నేతలపై వైకాపా ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. కేవలం నరసరావుపేటలోనే పార్టీ కార్యాకర్తలపై వైకాపా నాయకులు 120 కేసులు పెట్టారని అన్నారు. గుంటూరు జిల్లా నరసరావు పేట తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రభుత్వ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. వైకాపా నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి తెదేపా కార్యాకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ జీవీ ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు చేశారు. రొంపిచర్ల మాజీ సర్పంచ్ కోటిరెడ్డిపై రౌడీ షీట్ పెట్టాలని వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. పోలీసుల వేధింపులకు భయపడే కోటిరెడ్డి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ఎన్ని దాడులు చేసినా ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటామని నేతలు భరోసానిచ్చారు.
ఇదీ చదవండి: జైలు నుంచి విడుదల కానున్న చింతమనేని
sample description