అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మందడం మహాధర్నాలో నిరసన తెలియజేస్తున్న మహిళల పట్ల పోలీసులు తీరుపై కేంద్ర మానవ హక్కుల సంఘానికి తెదేపా ఫిర్యాదు చేసింది. బాధితులపై చర్యలు తీసుకోవాలని దిల్లీలో ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్‌కు తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఫిర్యాదు పత్రం అందజేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు వారిపై దాడి చేసి అమానుషంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు కనకమేడల వెల్లడించారు. దీనికి ఎన్హెచ్ఆర్సీ సానుకూలంగా స్పందించిందని... ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
సంబంధిత కథనాలు
మందడంలో ఉద్రిక్తత.. పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ
మహాధర్నాలో పోలీసుల అత్యుత్సాహం... సొమ్మసిల్లిన మహిళ
'మహిళల గొంతునొక్కడం... నిరంకుశ పాలనకు నిదర్శనం'