గుంటూరు జిల్లా నగరం మండలంలో అర్ధరాత్రి పోలీసులు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈదుపల్లి గ్రామంలోని ఆళ్ల చౌదరి అనే వ్యక్తి ఇంటి వెనుక ఉన్న పశువుల పాకాలో సీసాలు లభ్యమయ్యాయి. ఆళ్ల చౌదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
వైకాపా కుట్ర: ఎమ్మెల్యే అనగాని
ఆళ్ల చౌదరిపై కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అక్రమ కేసులు బనాయించిన ఎస్సైని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో ఆళ్ల చౌదరి కుటుంబ సభ్యులు పోటీకి నిలబడుతున్నారన్న కారణంగానే వైకాపా ఇలాంటి చర్యలకు దిగిందని ఆరోపించారు.
ఇదీ చదవండి : జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు...రేపటితో ముగియనున్న గడువు