ETV Bharat / state

Gymnastics training: జిమ్నాస్టిక్స్‌లో గుంటూరు జిల్లా క్రీడాకారుల ప్రతిభ - గుంటూరు బీఆర్ ఇండోర్ స్టేడియం

మిగతా క్రీడల కంటే జిమ్నాస్టిక్స్‌ కాస్త భిన్నం. వేగం, ఏకాగ్రత, కళ్లు చెదిరే విన్యాసాలు జిమ్నాస్టిక్స్ క్రీడ ప్రత్యేకతను చెబుతాయి. ఇలాంటి క్రీడలో గుంటూరు జిల్లా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. జిమ్నాస్టిక్స్‌లో 60 నుంచి 70మంది క్రీడాకారులు శిక్షణ తీసుకుంటుండగా ... అందులో 25మంది దాకా జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు.

జిమ్నాస్టిక్స్‌
జిమ్నాస్టిక్స్‌
author img

By

Published : Dec 1, 2021, 8:23 PM IST

జిమ్నాస్టిక్స్‌

Gymnastics: గుంటూరు బీఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జిమ్నాస్టిక్స్ శిక్షణ.... విద్యార్థుల్లో అంకితభావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. జిమ్నాస్టిక్స్ క్రీడలో ఆర్టిస్టిక్‌, రిథమిక్, ఆక్రోబాటిక్, ఏరోబిక్, ట్రంపోలిన్, తంబ్లిన్ విభాగాలుంటాయి. ఆర్టిస్టు విభాగంలోనే ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌, పామిల్ హార్స్, రోమన్ రింగ్స్, చేబుల్ వాల్ట్, ప్యారలల్ బార్స్, హారిజెంటల్ బార్స్ అంశాలుంటాయి. అమ్మాయిలు ప్రత్యేకించి అనీవన్ బార్స్, బ్యాలెన్సింగ్ బీమ్స్ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. చదువుతో పాటు జిమ్నాస్టిక్స్‌లో రాణించేందుకు ఉదయం, సాయంత్రం నాలుగు గంటలపాటు శిక్షణ పొందుతూ, ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

కోచ్ అఫ్రోజ్ ఖాన్ ఆధ్వర్యంలో క్రీడాకారులు కళ్లు చెదిరే ఫీట్లు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి కళాశాలకు వెళ్లే విద్యార్థుల వరకు శిక్షణ పొందుతున్నారు. ఏళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నామని... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించటమే తమ లక్ష్యమని క్రీడాకారులు చెబుతున్నారు. పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించినట్లు కోచ్‌ అఫ్రోజ్ ఖాన్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు మరింత కృషి చేయాల్సి ఉంటుందని... అందుకోసం ఫోమ్‌ ఫిట్‌ అవసరమవుతుందన్నారు.

బీఆర్ ఇండోర్ స్టేడియంలో ఫోమ్‌ ఫిట్‌ ఏర్పాటు చేస్తే... అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతామని... ఇందుకోసం దాతలు, ప్రభుత్వం సహకరించాలని క్రీడాకారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: Sri Tirupatamma Ammavari Temple: తిరుపతమ్మ అమ్మవారి సన్నిధిలో భక్తుల ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.