'రైతుల త్యాగాలు గుర్తిద్దాం-అమరావతిని కాపాడుకుందాం' - అమరావతి కోసం తాడికొండ రైతుల ఆందోళన
రాజధాని అమరావతికి సంఘీభావంగా గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద రైతులు బైఠాయించారు. గుంటూరు-అమరావతి ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు ధర్నా చేపట్టారు. రోడ్డుమీద వంటావార్పు చేశారు. 'రైతుల త్యాగాలను గుర్తిద్దాం- అమరావతిని కాపాడుకుందాం'అంటూ... నినాదాలు చేశారు. 3 రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.