ETV Bharat / state

చెత్త కుప్పలో భారీ పేలుడు.. బాంబు స్క్వాడ్ పరిశీలన - dumping yard

గుంటూరు జిల్లా వంకాయలపాడు గ్రామంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. గ్రామంలోని చెత్త కుప్పలో ఉన్న డబ్బాలలో గ్యాస్ ఉండడం వలన పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వాస్తవాల నిర్ధరణకు గుంటూరు నుంచి బాంబు స్క్వాడ్​ని పిలిపించి పరిశీలించారు.

చెత్త కుప్పలో భారీ పేలుడు.. బాంబు స్క్వాడ్ పరిశీలన
author img

By

Published : Aug 14, 2019, 10:02 PM IST

Updated : Aug 14, 2019, 11:21 PM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలోని మసీదు పక్కనున్న చెత్తకుప్పలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో చెత్త సుమారు 20 మీటర్ల ఎత్తులో ఎగిరిపడింది. బాంబు పేలిన పెద్ద శబ్దంతో రావడం వలన గ్రామస్థులు ఆందోళన చెందారు. అయితే ఈ పేలుడులో ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వలన గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. చెత్త కుప్పలో డబ్బాలలో గ్యాస్ ఉండడం వలన పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. విషయాన్ని నిర్ధరించేందుకు పోలీసులు గుంటూరు నుంచి బాంబు స్క్వాడ్​ని పిలిపించారు. పేలుడు జరిగిన ప్రదేశంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. చెత్త కుప్పలో ఉన్న డబ్బాలలో గ్యాస్ ఉండటం వలన పెద్ద శబ్దం తో పేలి ఉండవచ్చునని తనిఖీల అనంతరం చిలకలూరిపేట గ్రామీణ సీ.ఐ సుబ్బారావు తెలిపారు. అంతేగాని ఎలాంటి బాంబులు లేవని.. ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'తెదేపాకు ఓట్లు వేసిన పులివెందుల ప్రజలు రౌడీలా..'

Intro:Ap_vsp_47_esuka_nibandhanalapy_andolana_ab_AP10077_k.Bhanojirao_8008574722
పని అయినా కల్పించండి అన్నమైనా పెట్టండి అంటూ
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు అనకాపల్లి ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు ఇసుక కొరతతో భవన నిర్మాణాలు ఆగిపోయి తాము వీధిన పడ్డామని ఇసుక కొరత సమస్యను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు

Body:మూడు నెలలుగా ఇసుకపై ఆంక్షలు విధించడంతో అనకాపల్లి ని భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పనుల కోసం రోజు ఉదయాన్నే వచ్చి పనులు లేకపోవడంతో తిరిగి ఖాళీ చేతులతో వెళ్లాల్సి వస్తుందని వాపోయారు ఇసుక పై ఆంక్షలు విధించి కేసులు రాయడం వల్ల భవన నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయి అన్నారు కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయని వాపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్రమణలు జరిగాయంటూ ప్రస్తుత ప్రభుత్వం తమను పస్తులు పెట్టడం అన్యాయమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుక పై తన విధానాన్ని ప్రకటించి కొరత లేకుండా చూడాలని కోరారు

Conclusion:బైట్1 భద్రం ఏఐటీయూసీ నాయకులు
బైట్2 కోన లక్ష్మణ్ ఏఐటీయూసీ జిల్లా నాయకులు
బైట్3 భవన నిర్మాణ కార్మికురాలుఅనకాపల్లి
Last Updated : Aug 14, 2019, 11:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.