గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ సమీపంలో....ఆకస్మాత్తుగా ఓ కారులో మంటలు చెలరేగి ఇరువురికి తృటిలో ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళితే..
నకరికల్లు మండలం రూపెనగుంట్లకు చెందిన మాజీ సర్పంచి వేల్పుల ఆదినారాయణ తన వియ్యంకుడిని నరసరావుపేటలో దింపి వచ్చేందుకు రూపెనగుంట్ల గ్రామం నుంచి తన కారులో బయలుదేరాడు. శాంతినగర్ సమీపంలోని నరసరావుపేట - హైదరాబాద్ ప్రధాన రహదారిపైకి వచ్చే సమయంలో కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ఇద్దరు కారులో నుంచి బయటకు దిగి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కారు మాత్రం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.
ఇదీ చదవండి