గుంటూరు జిల్లా కొల్లూరులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమ నిర్బంధంలోకి తీసుకొన్నారంటూ షేక్ అక్తర్ రోషన్ అనే వ్యక్తి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది.
నవీన్, అశోక్ అనే ఇద్దరు వ్యక్తులను తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట పోలీసు స్టేషన్కు చెందిన పోలీసులు అక్రమ నిర్భందంలోకి తీసుకుని, చిత్రహింసలకు గురి చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది రాజిరెడ్డి వాదనలు వినిపించారు. అక్రమ నిర్భందంపై ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏడీజీ స్థాయి అధికారితో విచారణ జరిపి రెండు రోజుల్లో పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను రెండు రోజులకు వాయిదా వేసింది ధర్మాసనం.
ఇదీ చదవండి : KOPPARRU INCIDENT: కొప్పర్రు ఘటన బాధ్యులను అరెస్టు చేశాం: ఎస్పీ విశాల్ గున్నీ