కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై అధికారులతో సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల మహోత్సవాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11వ తేదీన నిర్వహించనున్నారు. ఏ శాఖలు ఎంతమేరకు పనులు పూర్తి చేశాయన్న విషయాన్ని సబ్ కలెక్టర్.. అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తిరునాళ్ల ప్రారంభమవడానికి కనీసం రెండు రోజుల ముందుగానే అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీటి ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, రవాణా తదితర అంశాలపై అధికారులకు.. సబ్ కలెక్టర్ పలు సూచనలు చేశారు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్‌రావు మాట్లాడుతూ తిరునాళ్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇదీ చదవండి: