Students protest: గుంటూరు జిల్లా, తెనాలి ఐతనగర్ ఎన్ఎస్‌ఎస్‌ఎమ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యాబోధన చేయకుండా ఎల్లప్పుడూ చరవాణీలోనే నిమగ్నమౌతున్న ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని మూడు రోజుల క్రితం పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సదరు ఉపాధ్యాయురాలికి సంఘంలోని పెద్ద నాయకుల సహకారం ఉండటంతో మండల స్థాయి అధికారులు విచారణ చేసినప్పటికీ ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో విద్యాశాఖాధికారులకు, పేరెంట్స్ కమిటీ సభ్యులకే తిరిగి బెదిరింపులు రావటంతో ఎస్ఎఫ్ఐ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు నల్లజెండాలతో పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. డీఈవో కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే ఆ ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి