ETV Bharat / state

'వైకాపా తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు' - local body election news in ap

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులపై వైకాపా చేసిన దౌర్జన్యాలను నిరసిస్తూ నామినేషన్ల ప్రక్రియను తిరిగి నిర్వహించాలని పలు జిల్లాలో భాజపా, జనసేన, వామపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.

'వైకాపా తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు'

author img

By

Published : Mar 16, 2020, 11:30 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గందరోగోళ పరిస్థితులను నిరసిస్తూ ప్రతిపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తిరిగి ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కళ్లకు గంతలు కట్టుకుని ధర్నాలు చేశారు.

నాయుడుపేటలో మౌన నిరసన

నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట భాజపా ఆధ్వర్యంలో మౌన నిరసన చేపట్టారు. రాష్ట్రంలో నామినేషన్ వేసేందుకు అవకాశం లేకుండా వైకాపా శ్రేణులు దాడులు నిర్వహించాయని తెలిపారు. మళ్లీ నామినేషన్లు ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. నల్లరంగు రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఆర్డీవో సరోజినికి వినతిపత్రం అందించారు. ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరారు.

నెల్లూరులో వైకాపా తీరుకు నిరసనగా ధర్నా

నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని...

అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నామపత్రాల చించివేత, ప్రతిపక్ష పార్టీలపై దాడులను నిరసిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో భాజపా నాయకులు, కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని తహశీల్దార్​కు వినతిపత్రం సమర్పించారు.

హిందూపురంలో వైకాపా తీరుకు నిరసనగా ధర్నా

యర్రగొండపాలెంలో వినూత్న నిరసనలు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వైకాపా చేసిన బెదిరింపులు, అరాచకాలకు నిరసనగా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. వైకాపా సృష్టించిన అరాచకాలు మునుపెన్నడూ లేవని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శాసనాల సరోజిని విమర్శించారు. ఈ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని ఆర్డీఓ శేషిరెడ్డికి భాజపా నాయకులు వినతి పత్రం అందజేశారు.

యర్రగొండపాలెంలో వైకాపా తీరుకు నిరసనగా ధర్నా

ఏలూరులో భాజపా ఆధ్వర్యంలో మౌనదీక్ష

స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద భాజపా ఆధ్వర్యంలో మౌన దీక్ష కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టిన దగ్గర్నుంచి నామినేషన్ల గందరగోళం, అరాచకాలు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆరోపించారు. ఎన్నికల సంఘం ఆరు వారాలు ఎన్నికలను వాయిదా వేయడం కాదని పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని గవర్నర్​కు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు.

వైకాపా దాడులకు నిరసనగా బాపట్లలో భాజపా, జనసేన ర్యాలీలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా చేసిన భౌతిక దాడులను భాజపా, జనసేన పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ బాపట్ల భావన్నారాయణస్వామి దేవస్థానం నుండి జి బి సి రహదారి మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన చేశారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్​కు వినతి పత్రాన్ని సమర్పించారు.

విశాఖలో భాజపా, జనసేన నిరసనలు

స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో భాజపా, జనసేన పార్టీలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలు చేశారు. ఏకపక్ష, అప్రజాస్వామిక, దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్​ పాల్గొన్నారు.

'వైకాపా తీరుకు నిరసనగా విశాఖలో ధర్నా

ఎన్నికలు రద్దు చేయండి

గుంటూరు జిల్లా పల్నాడులో ఎన్నికలు రద్దు చేయాలంటూ నరసరావుపేట ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లుకు పార్లమెంట్ భాజపా అధ్యక్షుడు సైదారావు ఆధ్వర్యంలో నరసరావుపేట పార్లమెంట్​లోని నియోజకవర్గాల భాజపా నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్నికల కమీషన్ ఎన్నికలను వాయిదా వేయడాన్ని భాజపా పూర్తిగా స్వాగతిస్తోందని సైదారావు తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొన్న తరువాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా నేతలపై దాడులు, ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఆ పార్టీ నేతలు గుంటూరులో ఆందోళన చేపట్టారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసనకు దిగారు.

గుంటూరులో వైకాపా తీరుకు నిరసనగా ధర్నా

రాజమహేంద్రవరం, కాకినాడలో భాజపా మౌనదీక్ష

స్థానిక ఎన్నికల ప్రక్రియ తిరిగి చేపట్టాలంటూ రాజమహేంద్రవరంలో భాజపా నాయకులు మౌన దీక్ష చేపట్టారు. నోటికి నల్ల వస్త్రాలు కట్టుకొని నిరసన తెలిపారు.రాష్ట్రంలో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఆరోపించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ జారీచేయాలని కాకినాడలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో భాజపా నాయకులు నోటికి నల్ల వస్త్రాలు కట్టుకుని నిరసన తెలిపారు. జిల్లాలో పలుచోట్ల అభ్యర్ధుల నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శించిన.. కోడ్‌ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

వైకాపా తీరుకు నిరసనగా రాజమహేంద్రవరంలో ధర్నా

నల్లబ్యాడ్జీలతో నిరసన

స్థానిక సంస్థల్లో వైకాపా చేసిన దౌర్జన్యాలను నిరసిస్తూ కడప జిల్లా భాజపా అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఆరోపించారు. కనీసం నామినేషన్ కూడా వేయకుండా పోలీసులు, వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడం సిగ్గుచేటని ఆయన ఖండించారు. ఎన్నికల తీరును నిరసిస్తూ కడప కలెక్టరేట్ ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కరోన వైరస్​తో ప్రపంచ దేశాలన్నీ వణుకుతుంటే జగన్ మాత్రం ఎన్నికలు నిర్వహించాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు.

కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు నిరసనగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ముందు భాజపా నిరసన చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

'వైకాపా తీరుకు నిరసనగా కర్నూలులో ధర్నాలు'

'ఎన్నికలను ప్రాథమిక దశ నుంచి ప్రారంభించాలి'

స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నామినేషన్‌ ప్రక్రియ నుంచి ప్రారంభించాలని భాజపా డిమాండ్‌ చేసింది. రా ష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఎన్నికలను మళ్లీ ప్రాథమిక దశనుంచి ప్రారంభించాలని కోరుతూ కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు.

విజయవాడలో ధర్నా

శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట భాజపా మౌనదీక్ష

శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయం వద్ద భాజాపా, జనసేన పార్టీల నాయకులు మౌనదీక్ష చేపట్టారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా నాయకుల దౌర్జన్యాలపై మండిపడ్డారు. భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులపై జరిగిన దాడులను తప్పుపట్టారు.

శ్రీకాకుళం కలెక్టర్ ఎదుట ధర్నా

ఇవీ చదవండి

'ఎన్నికల మీద ఉన్న ధ్యాస కరోనా నియంత్రణ మీద లేదా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.