ETV Bharat / state

'సంగం డెయిరీ యాజమాన్య హక్కుల బదలాయింపు కుట్రపూరితం' - సంగం డెయిరీపై ప్రత్యేక కథనం

గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చింది. దీన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ డెయిరీ డెవలప్​మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ చర్యలను డెయిరీ పాలక మండలి తప్పుపట్టింది. పాడి రైతులకు నష్టం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సంస్థ డైరెక్టర్లు ఆరోపించారు.

sangam dairy
సంగం డెయిరీ
author img

By

Published : Apr 28, 2021, 7:25 AM IST

డెయిరీ యాజమాన్య హక్కుల బదలాయింపు కుట్రపూరితం

సంగం డెయిరీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈనెల 23న సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర.. సంస్థ ఎండీ గోపాలకృష్ణన్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. డెయిరీ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు చేశారు. అరెస్టుల తర్వాత అనిశా అధికారులు గత 4రోజులుగా డెయిరీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సంగం డెయిరీ పాలనా వ్యవహారాలకు సంబంధించిన దస్త్రాలు పరిశీలించారు. కొన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో సంగం డెయిరీని.. ఏపీ డెయిరీ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వటం కలకలం రేపింది. అనిశా నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

గతంలో గుంటూరు జిల్లా పాడి రైతుల సంఘంగా ఉన్న సంస్థను సంగం డెయిరీగా మార్చారని.. ఇపుడు మళ్లీ పాత సంస్థ పేరిట కార్యకలాపాలు జరుగుతాయని వివరించింది. తెనాలి సబ్‌ కలెక్టర్ ఈ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారని తెలిపింది. పాల సేకరణతో పాటు రోజువారి కార్యకలాపాలు, వ్యాపార వ్యవహారాల్ని ఎవరు అడ్డుకున్నా చర్యలు తీసుకునే అధికారం సబ్ కలెక్టర్ కు కట్టబెట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్..సంగం డెయిరీకి వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడారు. అదే సమయంలో డెయిరీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించారు. పొన్నూరు మండలం చింతలపూడిలో నర్రా వెంకట కృష్ణప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ చర్యలపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.

ధూళిపాళ్ల అరెస్టు, డెయిరీ యాజమాన్య హక్కుల బదలాయింపు అన్నీ ప్రభుత్వ కుట్రగా సంస్థ డెరక్టర్లు ఆరోపిస్తున్నారు. పాడి రైతులకు ఉపయోగపడేలా ఆసుపత్రి ఏర్పాటు కోసం స్థలం బదలాయించారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ డెయిరీలను అముల్‌కు అప్పగిస్తున్న ప్రభుత్వం.. సంగం వంటి ప్రైవేటు డెయిరీని ప్రభుత్వ రంగ సంస్థ పరిధిలోకి తేవటాన్ని వారు తప్పపడుతున్నారు. ఇదంతా రాజకీయ కుట్ర కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ చర్యల్ని నిరసిస్తూ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.

ప్రభుత్వం నిర్ణయంతో గుంటూరు జిల్లా పాడి రైతుల్లో ఆందోళన నెలకొంది. సంగం డెయిరీకి పాలు పోసే రైతులకు మంచి ధర ఇవ్వటంతో పాటు లాభాల్లో బోనస్ అందించేది. రైతులకు పశుగ్రాసాన్ని రాయితీపై ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం తమను పట్టించుకుంటుందా లేదా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండీ.. సర్కార్ పరిధిలోకి సంగం డెయిరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.