గుంటూరు జిల్లా దాచేపల్లిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో గురజాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఎస్ఈబీ, ఏఎస్పీ ఆదేశాలతో దాచేపల్లిలోని ప్రభుత్వ ఔట్లెట్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో తెలంగాణ కు చెందిన మద్యాన్ని అమ్మడం లేదని అధికారులు గుర్తించారు. అదే విధంగా మద్యం అక్రమ విక్రయానికి పాల్పడితే గురజాల ఇన్ఛార్జ్ ఎస్ఈబీ సీఐ కొండారెడ్డికి సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.