రాజధాని ప్రాంత పరిధిలోని గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో 56 వార్డుల్లో 521 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందని గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. వీటిలో 61 అతి సమస్యాత్మక, 41 సమస్యాత్మక వార్డులను గుర్తించినట్లు చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల బందోబస్తుకు 1071 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. 44 స్ట్రైకింగ్ ఫోర్సు టీములు, 8 స్పెషల్ స్ట్రైకింగ్ టీముల ఏర్పాటు చేశామన్నారు. మిగతా ప్రాంతాల నుంచి గుంటూరు నగరానికి వచ్చే రహదార్లపై 24 గంటలు పనిచేసేలా 6 చెక్ పోస్టుల ఏర్పాటు చేశామని.... ఇంతవరకు 55 లక్షల రూపాయలు సీజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించామని ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి