ETV Bharat / state

క్షేత్రస్థాయిలో కర్ప్యూ అమలు తీరుని పరిశీలించిన ఎస్పీ అమ్మిరెడ్డి

author img

By

Published : May 22, 2021, 7:23 PM IST

గుంటూరులో కర్ఫ్యూ అమలు తీరుని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండో దశలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కొవిడ్​ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

covid patients
క్వారంటైన్​కు తరలింపు

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. గుంటూరు అర్బన్ పోలీసులు కర్ప్యూను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కొవిడ్​ ఆంక్షల అమలు తీరుని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొవిడ్​ బాధితులు పలు కారణాలతో… ఆరోగ్యంగా ఉన్న వారిని వెంట తీసుకుని ప్రయాణించటంపై ఎస్పీ దృష్టి సారించారు. దీనివల్ల మరింత వేగంగా వైరస్..​ ఇతరులకు సోకే అవకాశముందని చెప్పారు.

పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్​పోస్టుల వద్ద అంబులెన్సులు అందుబాటులో పెట్టి.. తనిఖీల్లో ఎవరైనా కొవిడ్​ రోగులు తారసపడితే వారిని క్వారంటైన్​కి తరలించాలని ఆదేశాలిచ్చారు. ఈ రోజు ఐదుగురు కరోనా పాజిటివ్​ రోగులను పోలీసులు టిడ్కోకి తరలించారు. పాజిటివ్ వచ్చినవారు హోం ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్ లేదా హాస్పిటల్​లో ఉండాలని సూచించారు. వివిధ కారణాలతో బయట తిరగటం వలన ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదముందని ఎస్పీ అమ్మిరెడ్డి వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.