ETV Bharat / state

గుంటూరు జోరు... సరకు రవాణాతో రూ.388 కోట్లు ఆదాయం

గుంటూరు రైల్వే డివిజన్​ సరకు రవాణాతో గతేడాదితో పోల్చితే అధిక ఆదాయాన్ని గడించింది. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజనాన్ మాల్యా అధికారులను అభినందించారు. కొత్త ప్రణాళికలతో సిద్ధమవ్వాలని సూచించారు.

guntur railway zone goods revenue doubled
సరకు రవాణాతో రూ. 388 కోట్లు.. గుంటూరు రైల్వే డివిజన్ జోరు
author img

By

Published : Mar 13, 2021, 8:12 PM IST

గుంటూరు రైల్వే డివిజన్లో సరకు రవాణా గతేడాదితో పోలిస్తే రెట్టింపయ్యింది. 2019-20లో సరకు రవాణా ద్వారా రూ. 193.4 కోట్ల ఆదాయం రాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అది రూ.388 కోట్లకు పెరిగినట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. గతేడాది 1.55 మిలియన్ టన్నుల సరకు ఎగుమతులు చేయగా.. ఈసారి అది 2.71కు చేరింది. దీని వల్ల 93శాతం సరకుల్ని అదనంగా రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆదాయం వచ్చింది ఇలా...

ఇందులో బంగ్లాదేశ్​కు మిర్చి రవాణా వల్ల రూ. 6.22 కోట్లు ఆదాయం వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలకు సిమెంటు, ముడిసరకు రవాణా ద్వారా రూ.47 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మిర్చితో పాటు మొక్కజొన్న, జొన్న, బియ్యం, సిమెంటు తయారీలో వాడే సున్నపురాయిని రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు.

వచ్చే ఏడాదికి కొత్త ప్రణాళికలు...

నాగిరెడ్డిపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన లోడింగ్ పాయింట్ నుంచి రవాణా చేసిన సరకుల ద్వారా రూ. 27 కోట్లు వచ్చినట్లు వివరించారు. సరకు రవాణాలో రెట్టింపు ఆదాయం పొందటంలో చొరవ చూపిన గుంటూరు రైల్వే డివిజన్ అధికారుల్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజనాన్ మాల్యా అభినందించారు. వచ్చే ఏడాది ఇంతకు రెట్టింపు ఆదాయం పొందటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాల కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.