గుంటూరును స్వచ్ఛ నగరంగా మార్చటంలో ప్రజలందరూ సహకరించాలని మేయర్ కావటి మనోహరనాయుడు విజ్ఞప్తి చేశారు. వార్డు సచివాలయ సిబ్బందికి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించిన కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఐటీసీ సంస్థ సహకారంతో నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే సచివాలయ సిబ్బందికి ఈ కిట్లను అందజేశారు.
జిల్లాలో స్వచ్ఛ కార్యక్రమాలకు సంబంధించి ఐటీసీ సంస్థ..మూడేళ్లుగా కార్పోరేషన్ తో కలిసి పని చేస్తోంది. ప్రస్తుతం స్వచ్ఛ గుంటూరు కార్యక్రమాన్ని రెండు వార్డుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టామని.. అందుకు ఈ సంస్థ సహకరిస్తోందని మేయర్ తెలిపారు. త్వరలోనే నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెరుగైన స్వచ్ఛ కార్యక్రమాల్ని నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండి: