గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రకాష్‌నగర్ ప్రాంతానికి చెందిన సాయి శ్రీ చరిత్... అనే బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో కుమ్మరిపాలెం నుంచి ప్రకాష్‌నగర్ కు వస్తున్న ఐషర్ లారీ బాలుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయి శ్రీ చరిత్ లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు... సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్‌కు తరలించి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు నరసరావుపేట ఒకటో పట్టణ సీఐ ప్రభాకరరావు తెలిపారు.
ఇదీచదవండి.