అపహరణకు గురైన ఆరేళ్ల బాలుడు చివరికి విగతజీవిగా మారి, హృదయ విదారక స్థితిలో కనిపించిన ఘటన... గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. తాడేపల్లి మండలం మెల్లెంపూడికి చెందిన భార్గవతేజ... ఆదివారం ఆడుకుంటూ ఉండగానే అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు, బంధువులు ఊరూవాడా గాలిస్తుండగానే... సమీపంలోని పొలాల్లో మృతదేహం లభ్యమైంది. బాలుడి ముఖంపై తీవ్రమైన గాయాలు, చేతి వేళ్ళు, కాళ్లు విరిచేసినట్లు ఉన్న ఆనవాళ్లు అందరినీ ఆవేదనకు గురిచేశాయి.
కనిపించకుండా పోయిన కుమారుడు తిరిగి క్షేమంగా రావాలని ఎదురుచూసిన తల్లిదండ్రులు... ఈ వార్త విని కుప్పకూలిపోయారు. నిత్యం హుషారుగా తిరిగే భార్గవ్‌తేజ విషాదాంతంపై గ్రామస్థులు సైతం కన్నీరుపెట్టారు.
నిందితులు ఎలాంటి ఆధారాలూ దొరక్కుండా పక్కాగా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసును సవాల్‌గా తీసుకుని.... భార్గవతేజ్ హత్యకు దారితీసిన పరిస్థితులేంటి, ఆర్థిక లావాదేవీలే కారణమా, ఇంకేమైనా అంశాలున్నాయా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక రాగానే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇవీ చదవండి