ETV Bharat / state

SI Physical Fitness Schedule: గుడ్​ న్యూస్​.. ఈ నెల 25 నుంచి ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

SI Physical Fitness Schedule: నాలుగేళ్ల తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో నిరుద్యోగులు సంతోషించేలోపే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఎస్సై పోస్టుల దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ ప్రకటనలో తెలిపారు.

SI_Physical_Fitness_Notification
SI_Physical_Fitness_Notification
author img

By

Published : Aug 11, 2023, 10:11 PM IST

SI Physical Fitness Schedule: ఈ నెల 25 నుంచి ఎస్సై పోస్టుల దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో పరీక్షల నిర్వహిస్తున్నామన్నారు. విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలులో దేహదారుఢ్య పరీక్షలు జరుపనున్నట్లు తెలిపారు. ఎస్సై పోస్టుల ప్రాథమిక పరీక్షలో 56,923 మంది అభ్యర్ధులు అర్హత సాధించారని.. 56,116 మంది అభ్యర్ధులు దేహదారుఢ్య పరీక్షలకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈనెల 14 నుంచి ఆన్​లైన్​లో అర్హులైన అభ్యర్ధులు కాల్ లెటర్స్ డౌన్​లోడ్ చేసుకోవచ్చన్నారు. 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్​లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అనంతరం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించింది.

Police Physical Fitness Test: ప్రాథమిక పరీక్ష పూర్తై రెండు నెలలు.. దేహదారుఢ్య పరీక్షలు ఇంకెప్పుడు?

Notification for SI posts on 28 November 2022: రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 28న 6 వేల100 కానిస్టేబుల్, 411 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనవరి 22న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించగా.. 95 వేల 208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్సై ఉద్యోగాలకు ఫిబ్రవరి 19న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించగా.. 57 వేల 923 మంది అర్హత సాధించారు.మొదట మార్చి 13 నుంచి 20 వరకు దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ లోపే ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల కారణంగా షెడ్యూల్ వాయిదా వేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. పరీక్షల తేదీల్ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. నేటీకి వాటి ఊసేలేదు. ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు క్రీడా మైదానంలో కుస్తీ పడుతున్నప్పటికీ.. ప్రభుత్వ అలసత్వం వారి గమ్యాన్ని దూరం చేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నెలల తరబడి మైదానాల్లో సాధన చేస్తున్న అభ్యర్థుల్లో నిరాశ మొదలైంది.

SI, Constable Candidates Protest: 'నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో పోలీస్ నియామకాలేవి..?'

Disappointment among candidates: ప్రాథమిక పరీక్ష నిర్వహించి రెండు నెలలు గడిచినా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకపోవటంతో అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎంత కష్టపడైనా పోలీసు కొలువు సాధించాలనే దృఢ సంకల్పంతో నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి శిక్షణ తీసుకుని వసతి, భోజన సదుపాయాల కోసం వేల రూపాయలు ఖర్చు చేశారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్ష పూర్తి అవుతుందని అభ్యర్థులు ఆశించినప్పటికీ.. వాస్తవ పరిస్థితిల్లో అది నెరవేరే లేదు. దీంతో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక.. నెలల తరబడి సాధన చేయలేక.. ఆర్థిక భారం భరించలేని అభ్యర్థులు.. నిరాశతో స్వస్థలాలకు తిరుగు ప్రయాణంమయ్యారు. ఇప్పుడు తాజాగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డు ఛైర్మన్ ప్రకటనలో తెలపడంతో యువతలో కొంత ఉత్సాహం నెలకొంది.

Physical Fitness Tests: మహిళా పోలీసు ఉద్యోగాలకు ఇకపై శారీరక సామర్థ్య పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.