ETV Bharat / state

'స్టాఫ్​ నర్సుల పోస్టులు భర్తీ చేయండి' - STAFF NURES

ప్రజల ఆరోగ్య పరిరక్షణలో నర్సులు అందించే తోడ్పాటు వెలకట్టలేనిది. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరు సేవలందించారు. వైద్యరంగంలో డాక్టర్ల మాదిరే నర్సులదీ ఎంతో కీలకపాత్ర. కానీ జనాభా, వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా నర్సులు, ఎఎన్​ఎమ్​ల సంఖ్య పెరగడం లేదు.

'స్టాఫ్​ నర్సుల పోస్టులు భర్తీ  చేయండి'
'స్టాఫ్​ నర్సుల పోస్టులు భర్తీ చేయండి'
author img

By

Published : Feb 18, 2021, 4:26 PM IST

Updated : Feb 22, 2021, 4:44 PM IST

ఆపదలో ఉన్న రోగులకు బాసటగా నిలుస్తూ అనునిత్యం వారిని కంటికి రెప్పలా కాపాడే నర్సులు, ఆరోగ్య కార్యకర్తల కృషి ఎనలేనిది. వైద్యులు పరీక్షించిన అనంతరం రోగిని సంరక్షించడం... సమయానికి ఇంజక్షన్‌లు, మందులు ఇవ్వడం వంటి పనులు నర్సులే చేస్తారు. రక్తపోటు, మధుమేహం, బరువు వంటివి ఎప్పటికప్పుడు నమోదుచేసి వైద్యులకు అందిస్తారు. గ్రామాల్లో పనిచేసే... ఎఎన్​ఎమ్​లదీ అలాంటి పాత్రే. కానీ మిగతా దేశాలతో పోలిస్తే నర్సులు, ఎఎన్​ఎమ్​ల సంఖ్య మనదేశంలో అత్యంత స్వల్పంగా కన్పిస్తోంది.

ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా 22 లక్షల 72వేల 208 మంది నర్సులు, ఎఎన్​ఎమ్​లు ఉన్నారు. దేశంలో 5వేల85 నర్సింగ్ శిక్షణా సంస్థలుండగా... ఏటా 3.35 లక్షల మంది కొత్తగా శిక్షణ పొందుతున్నారు. ప్రతి వెయ్యిమంది జనాభాతో పోల్చిచూస్తే వీరి సంఖ్య 1.79 మాత్రమే. వైద్యుల తర్వాత అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న వీరి సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరముందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు నర్సులు అందించిన సేవలు అందరి అభిమానాన్ని చూరగొన్నాయి. రాష్ట్రంలో నర్సులు, ఎఎన్​ఎమ్​ల ఖాళీలు 8వేల వరకు ఉన్నాయి. 2011 నుంచి నర్సుల పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయడం లేదు. సాధారణంగా ఐసీయూ, కాన్పుల వార్డుల్లో మంచానికి ఒకరు చొప్పున, జనరల్ వార్డుల్లో నాలుగు మంచాలకు ఒకరు చొప్పున నర్సులు బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది.

సామాజిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వాలు.... ఆ లక్ష్యం నెరవేరాలంటే కీలకమైన నర్సులు, ఎఎన్​ఎమ్​ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వం స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

702 పంచాయతీల్లో మా మద్దతుదారుల విజయం : తెదేపా ప్రకటన

Last Updated : Feb 22, 2021, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.