గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారకోడూరు వద్ద ఓ కారు నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అందులోని వ్యక్తులు అప్రమత్తమవ్వటంతో ప్రాణాలతో బయటపడ్డారు. పొన్నూరుకు చెందిన ఖాదర్ బాషా మరో వ్యక్తితో కలిసి కారులో గుంటూరు నుంచి వస్తుండగా.. వాహనంలో షార్ట్ సర్కూట్ జరిగి ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన కారులోని వ్యక్తులు.. బయటకు దూకేశారు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఇదీ చదవండీ.. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి..