గుంటూరు జిల్లా చిలకలూరిపేట పురపాలక సంఘం ఛైర్మన్గా షేక్ రఫాని, వైస్ ఛైర్మన్గా కొలిశెట్టి శ్రీనివాసరావులు.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్స్అఫిషియో సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే విడదల రజిని వారిని అభినందించారు. మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 38 వార్డుల్లో 30 స్థానాలను వైకాపా కైవసం చేసుకోగా.. మిగతా 8 చోట్ల తెదేపా గెలుపొందింది. ఫలితంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక లాంఛనమైంది.
ఛైర్మన్ పదవి రావడానికి సహకరించిన ఎమ్మెల్యే విడదల రజినికి షేక్ రఫాని కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ఛైర్మన్లతో పాటు ఇతర వార్డు సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: