గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాల సాహితీ వేత్త, రచయిత షేక్ అబ్దుల్ హకీం జానీ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మహారాష్ట్రలో పాఠ్యపుస్తకాల్లో జానీ రచనలకు స్థానం దక్కింది. 2019-20 విద్యాసంవత్సరానికి తెలుగును ద్వితీయ భాషగా ఎంచుకునే పదకొండవ తరగతి విద్యార్థుల తెలుగువాచకంలో జానీ రచనలు భాగమయ్యాయి. జానీ రాసిన అమ్మ ఒడి కథల సంపుటిలోని 'బాధ్యతాయుత పౌరులు' అనే అంశంపై రాసిన కథనంను మహారాష్ట్రప్రభుత్వం తన పాఠ్యప్రణాళికల్లో పొందుపర్చింది. ఇలాంటి గుర్తింపులు తనలో బాధ్యతను పెంచుతాయని జానీ అంటున్నారు.
ఇదీ చూడండి