ETV Bharat / state

వైద్య శిఖామణి డాక్టర్‌ కొడాలి పాపారావు కన్నుమూత - డాక్టర్‌ కొడాలి పాపారావు కన్నుమూత

వైద్య వృత్తిలో ఉత్తమ సేవలు అందిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలానికి చెందిన డాక్టర్ కొడాలి పాపారావు (96) అనారోగ్యంతో కన్నుమూశారు.రేపల్లె తీర ప్రాంతాల్లో 6 దశాబ్దాల సుదీర్ఘ వైద్య వృత్తిలో ఎందరికో ప్రాణం పోసి ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వైద్యుడు పాపారావు.

డాక్టర్‌ కొడాలి పాపారావు కన్నుమూత
డాక్టర్‌ కొడాలి పాపారావు కన్నుమూత
author img

By

Published : May 6, 2021, 11:45 AM IST

తీరప్రాంతంలో ఉత్తమ వైద్యసేవలు అందించడం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైద్య శిఖామణి డాక్టర్‌ కొడాలి పాపారావు(96) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా కొడాలివారిపాలెంలో జన్మించిన పాపారావు గుంటూరు జిల్లా అమృతలూరు మండలం తురిమెళ్లలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. విశాఖపట్నం మెడికల్‌ కళాశాల నుంచి వైద్య పట్టా పొందారు.

మిలిటరీలో పనిచేసి దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్య సేవలందించారు. గూడవల్లిలోని తన సోదరి కుమార్తెను వివాహం చేసుకుని స్థిరపడ్డారు. చెరుకుపల్లిలో హరి మెమోరియల్‌ వైద్యశాలను స్థాపించి లాంతర్ల వెలుగులో శస్త్రచికిత్సలు నిర్వహించారు. కలరా, మశూచి వ్యాధులు ప్రబలిన సమయంలో తీర ప్రాంతంలో విశేష సేవలందించి మన్ననలు పొందారు. ఆయన కుమారుడు, కుమార్తెలు, మనుమలు వైద్య వృత్తిలో కొనసాగుతూ వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. పాపారావు మృతి వైద్యరంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు సానుభూతి వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

కరోనా విలయం.. మరోసారి 4 లక్షలకు పైగా కేసులు

ఈరోజు మీ రాశి ఫలాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.