దేశంలో మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలు, ఆకృత్యాలు తనను కలిచివేశాయని సినీనటి నగ్మా పేర్కొన్నారు. అందుకు నిరసనగా ఈ సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకొవట్లేదని చెప్పారు. గుంటూరు గుంటగ్రౌండ్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు నగ్మా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన దిశ చట్టాన్ని స్వాగతించారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ గాయకులు మను, శ్రీలేఖ, అనూప్‌రూబెన్స్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి: