మన రాష్ట్రాన్ని ఇతరులకు తాకట్టు పెట్టే వారికి కాకుండా... రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమించే నాయకుడిని గెలిపించాలని తెదేపా అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి వ్యాఖ్యానించారు. గుంటూరులో నిర్వహించిన పాస్టర్ల ఆత్మీయ సమావేశానికి ఆమె హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలని పాస్టర్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భూకబ్జాలు, అన్యాయాలు, అక్రమాలు చేసేవారికి ఓటుతో బుద్ధి చెప్పే సమయం అసన్నమైందన్నారు. ఓట్ల కోసం దొంగలు బయల్దేరారని.. కమ్యూనిటీ పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి
ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే.... అందరూ అడుగుతారు!