గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రకాష్ నగర్ లోని రిక్షా సెంటర్ లో భారీగా నిషేధిత గుట్కా పట్టుబడింది. పాత సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇల్లు అద్దెకు తీసుకుని భారీగా గుట్కా నిల్వలు ఉంచి విక్రయిస్తున్నాడన్న పక్కా సమాచారంతో రెండో పట్టణ పోలీసులు బుధవారం తెల్లవారుజామున సోదాలు చేశారు.
14 లక్షల రూపాయలు విలువ చేసే 56 సంచుల నిషేధిత గుట్కాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెంగుళూరు నుంచి గుట్కా సంచులు తీసుకువచ్చానని చెప్పినట్లు సిఐ పి.కృష్ణయ్య వివరించారు. అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: