గుంటూరు జిల్లా వినుకొండలో దాడులు నిర్వహించినట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వినుకొండలోని పరుచూరి కాశీ విశ్వనాధ్ అనే వ్యాపారి గోడౌన్లో నిషేధిత గుట్కా నిల్వ ఉంచారనే సమాచారం మేరకు దాడులు చేసినట్లు ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపారు. ఏడు రకాల నిషేధిత గుట్కాలు సీజ్ చేశామని.. వాటి విలువ మార్కెట్లో ఐదు లక్షల విలువ ఉంటుందని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: