ETV Bharat / state

కురిచేడు ఘటన.. గుంటూరు జిల్లా కంపెనీల్లో సిట్​ బృందం తనిఖీలు - seeko biotics in thadepalli latest news

sanitizer-incident-sit-team-is-conducting-inspections-at-seco-biotech-in-thadepalli

author img

By

Published : Aug 3, 2020, 9:29 PM IST

Updated : Aug 4, 2020, 12:46 AM IST

21:25 August 03

ప్రకాశం జిల్లా కురిచేడులో మత్తు కోసం శానిటైజర్ సేవించి 15 మంది మృతి చెందిన ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. మృతులు సేవించిన శానిటైజర్లు గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటలోని సీకో బయోటెక్ కంపెనీలో తయారైనట్లు సిట్ గుర్తించింది. సోమవారం రాత్రి తాడేపల్లిలోని ఆ సంస్థలో తనిఖీలు చేపట్టింది.

సీకో బయోటెక్​లో తయారయ్యే శానిటైజర్లలో ఎలాంటి రసాయనాలు కలుపుతున్నారనే అంశంపై సిట్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి బృందం విచారణ చేపట్టింది. కంపెనీలో ఉన్న సరుకును పరిశీలించింది. నిల్వ ఉన్న శానిటైజర్లు బాక్సులను సిట్ క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అక్కడి సిబ్బందిని ప్రశ్నించి.. సమాచారం సేకరించింది.

మహి ఫార్మా కంపెనీలోనూ

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులోని మహి ఫార్మా కంపెనీలోనూ సిట్​ బృందం తనిఖీలు నిర్వహించింది. కురిచేడు ఘటనకు సంబంధించి.. ఘటనా స్థలంలో లభించిన శానిటైజర్​ డబ్బాలు కొన్ని ఈ కంపెనీకు చెందినవి ఉన్నాయి. ఈ క్రమంలో అధికారులు ఇక్కడ విచారణ చేపట్టారు. ఫార్మా కంపెనీ అనుమతులు.. బిల్లులు పరిశీలించారు. కంపెనీ యాజమాన్యం నరసరావుపేటలోని డిస్ట్రిబ్యూటర్లకు పంపిణీ చేసినట్లు.. అక్కడి నుంచి ప్రకాశం జిల్లా కురిచేడు సరఫరా అయినట్లు బృందం పరిశీలనలో గుర్తించారు.

ఇదీ చదవండి..

కిక్కు కోసం శానిటైజర్ తాగి బలవుతున్న ప్రాణాలు

Last Updated : Aug 4, 2020, 12:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.