గుంటూరు జిల్లా తెనాలి 26వ వార్డు వైకాపా కౌన్సిలర్ ఇస్మాయిల్, అతని అనుచరులు కొట్టారంటూ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించాడు. 8వ డివిజన్లో పనిచేసే వినయ్ అనే కార్మికుడితో.. మాట్లాడాలంటూ పిలిపించి పార్టీ కార్యాలయంలో అతనిపై దాడి చేశారని చెప్పాడు. అన్యాయంగా తమ తోటి కార్మికుడిని కొట్టారంటూ 70 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించారు.
మున్సిపల్ కార్మికుడిపై దాడిని ఖండిస్తూ.. మారిస్‌పేట నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా చేపట్టారు. దీనిపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని కార్మికులు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకూ.. విధులు బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 6వేల మంది ఉపాధ్యాయులకు నెలన్నరగా అందని వేతనాలు