రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తెదేపా, వామపక్షాలు, జనసేన నాయకులు అడ్డుకుంటున్నారని బహుజన పరిరక్షణ సమితి ఆరోపించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో ఎమ్మార్పీస్, మాల మహానాడు, ఇతర ఎస్టీ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ప్రభుత్వం రాజధానిలో 52వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వాలని నిర్ణయిస్తే ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని నేతలు ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయన్నారు. తమ పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు వద్దా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి