గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు వద్ద రోడ్డు పక్కన నిల్చొన్న ఇద్దరు వ్యక్తులపైకి వెనుక నుంచి లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో శంకర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గుంటూరు సమీపంలోని కోరిటపాటు నుంచి దుండిపాలెంకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న శంకర్ రెడ్డి, అతని మేనమామ అంగలకుదురు సమీపంలో రోడ్డు పక్కన ఆగి మాట్లాడుతుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్ రెడ్డి మృతి చెందాడు. అతని మేనమామ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహన్ని తెనాలి ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: