గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద హైదరాబాదు నుండి నెల్లూరు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ఒకరి మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి నెల్లూరు వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రేకుల షెడ్డుపై కారు పడిందని అంటున్నారు. సుమారు 50 అడుగుల నుంచి 60 అడుగుల లోతులో కారు బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్ విడుదల