రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకున్నప్పటి నుంచి పలువురు ఉపాధ్యాయులు, విద్యార్ధులు కరోనా వైరస్ బారిన పడటం ఆందోళన కలిస్తోంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామం శ్రీరామ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడ్డారు. 50 మంది విద్యార్థులకు, 10 మంది ఉపాధ్యాయులుకు కొవిడ్-19 పరీక్షలు చేశారు. వారిలో ముగ్గురు విద్యార్థులకు, నలుగురు ఉపాధ్యాయులుకు పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధరించారు. ప్రస్తుతం వైరస్ బారిన పడ్డ పిల్లలు, ఉపాధ్యాయులు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
కొద్ది రోజుల క్రితం మేడికొండూరు మండలంలో నలుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడికి, ఫిరంగిపురం మండలంలో మునగపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ ఉందని వైద్యాధికారులు నిర్ధరించారు. పాఠశాలల్లో కరోనా విజృంభిస్తుండటంతో అధికారులు తరగతి గదులను శానిటైజేషన్ చేశారు. పాఠశాలల్లో కరోనా కేసులు నమోదు కావటం విద్యార్థు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి... దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పూనం మాలకొండయ్య