గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం ఎస్సీ కాలనీ వాసులు తృటిలో పిడుగుపాటు నుంచి తప్పించుకున్నారు. వసంత స్పిన్నింగ్ మిల్లు సమీపంలో ఎస్సీ కాలనీలోని ఓ చెట్టు మీద పిడుగు పడగా... సుబాబుల్ చెట్టు చివరి నుంచి మొదలు వరకు చీలింది.
అప్పటివరకు కాలనీ వాసులు కొంతమంది అక్కడ వంట చెరకు కోసం పుల్లలు కట్టుకున్నారు. పిడుగు పడటానికి కొద్ది నిమిషాల క్రితమే ఇళ్లకు వెళ్లారు. ప్రతి రోజూ పిల్లలు ఆ చెట్టుకింద నీడన ఆడుకుంటూ ఉండేవారు. ఈ రోజు పిడుగు పడిన సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని కాలనీ వాసులు తెలిపారు.
ఇదీ చదవండి:
నేడు, రేపు తెదేపా మాక్ అసెంబ్లీ... స్పీకర్గా ఎమ్మెల్యే డీబీవీ స్వామి!