ETV Bharat / state

Resident Doctors Stipend: 'కుటుంబ పోషణ కష్టంగా ఉంది.. స్టైఫండ్ పెంచండి' - సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్ వైద్యులు

Resident Doctors Demand Stipend Hike: ప్రాణాల్ని నిలబెట్టే రెసిడెంట్‌ వైద్యులు చాలీచాలని స్టైఫండ్‌తో రోడ్డున నిలబడ్డారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే సగం కూడా ఇవ్వట్లేదని ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ, పుస్తకాలకే.. ఇచ్చే వేతనం సరిపోవడం లేదని వాపోతున్నారు. స్టైఫండ్ పెంచేందుకు ప్రతిపాదనలు పెట్టి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని దిగులు చెందుతున్నారు. సర్కారు నిర్లక్ష్య ధోరణి వీడకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

Resident Doctors Demand Stipend Hike
రెసిడెంట్ వైద్యుల స్టైఫండ్
author img

By

Published : Jun 2, 2023, 7:33 AM IST

చాలీచాలని స్టైఫండ్‌తో రెసిడెంట్‌ వైద్యుల ఆవేదన

Resident Doctors Demand Stipend Hike: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వైద్యులకు కష్టాలొచ్చాయి. వైద్య విద్యనభ్యసిస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలందిస్తున్న రెసిడెంట్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న స్టైఫండ్ పెంచాలని కోరుతున్నారు. పొరుగు రాష్ట్రంలో రెసిడెంట్ వైద్యులకు అధిక వేతనాలిస్తున్నారని తమ గోడు వినిపిస్తున్నారు. స్టైఫండ్ పెంచేందుకు ప్రతిపాదనలు పెట్టి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. స్టైఫండ్​పై నిర్ణయం తీసుకోకుంటే సమ్మెకు సైతం వెనకాడమని హెచ్చరిస్తున్నారు.

రోగుల కష్టాలను తీర్చే వైద్యులకు తీరని కష్టాలొచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలందిస్తున్న సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్ వైద్యుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. ప్రభుత్వం తమకు ఇచ్చే స్టైఫండ్ సరిపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టైఫండ్ పెంచేందుకు ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని వాపోతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో రెసిడెంట్ వైద్యులకు 40 శాతం అధికంగా ఇస్తున్నారని చెబుతున్నారు. చదువుకుంటూ.. కుటుంబాన్ని పోషిస్తూ.. వైద్య సేవలందిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించి స్టైఫండ్ పెంచాలని కోరుతున్నారు. పెంచకుంటే పోరు తప్పదని హెచ్చరిస్తున్నారు.

CM Jagan Review: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు లేరనే మాట రావద్దు: సీఎం జగన్

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్ వైద్యులకు 56 వేల రూపాయలు స్టైఫండ్​గా ఇస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రెసిడెంట్ వైద్యులకు 96 వేల రూపాయల స్టైఫండ్ ఇస్తుందని, ఉత్తరప్రదేశ్​లో లక్ష రూపాయలకు పైగా ఇస్తున్నారని తెలిపారు. ఐదున్నరేళ్లు ఎంబీబీఎస్, మూడేళ్లు పీజీ పూర్తి చేసి సూపర్ స్పెషాలిటీలో మరో మూడేళ్ల పాటు వైద్య విద్యను అభ్యసిస్తూ రెసిడెంట్ వైద్యులుగా సేవలందిస్తున్నారు. తాము చదువుకోవాలంటే ఒక్కో పుస్తకం లక్ష రూపాయల పైనే ఖరీదు ఉంటుందని చెబుతున్నారు. కుటుంబాన్ని తామే పోషించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న స్టైఫండ్​ను పరిగణలోకి తీసుకుని తమకూ పెంచాలని కోరుతున్నారు. ప్రభుత్వం కొన్ని నెలల కిందట ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యను అభ్యసిస్తున్న రెసిడెంట్ వైద్యులకు 70, 72, 74 వేల రూపాయల చొప్పున ప్రతిపాదనలు పంపిందని.. అయితే ఇప్పటి వరకూ అవి ఆమోదం పొందలేదని చెబుతున్నారు.

ప్రభుత్వం స్టైఫండ్ పెంచాలని కోరుతూ దశల వారీగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముందుగా సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన, అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని తెలిపారు. అప్పటికీ స్పందించకుంటే సమ్మె చేసేందుకు సైతం వెనుకాడబోమని రెసిడెంట్ వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రెసిడెంట్ వైద్యుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

"మేమంతా సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్స్.. మా అందరికీ కుటుంబాలు ఉన్నాయి. చాలా మందికి పెళ్లి అయింది. ప్రస్తుతానికి మాకు ఇచ్చే స్టైఫండ్ అస్సలు సరిపోవట్లేదు. తెలంగాణలో అయితే 96 వేలు మొదటి సంవత్సరం వారికి ఇస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్​లో 56 వేలు మాత్రమే ఇస్తున్నారు. పెంచుతామని అన్నారు.. కానీ ఇప్పటి వరకూ పెంచలేదు". - డా.వైభవ్, ఏపీ జూడా వైస్ ప్రెసిడెంట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.