గుంటూరు జిల్లాలోని రాజధాని మండలాల్లో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయింది. రాజధాని మండలాలైన మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరులో సుమారు 135 చౌక దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన 7 విడతల కమీషన్ను వెంటనే విడుదల చేయాలని డీలర్లు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
కరోనా విజృంభిస్తున్న కారణంగా శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయాలని, ఒక్కొక్కరికి 10 లక్షల ఆరోగ్య, జీవిత బీమా కల్పించాలని కోరారు. సరకు అన్ లోడింగ్ సమయంలో హమాలీల కూలీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ హామీలను వెంటనే చెల్లించాలని.. అప్పటిదాకా దుకాణాలు తెరిచే ప్రసక్తి లేదని రేషన్ డీలర్లు తేల్చిచెప్పారు.
ఇవీ చూడండి: