ప్రభుత్వం మూడో విడత బియ్యం పంపిణీ కార్యక్రమం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో ప్రారంభమైంది. అయితే కొద్ది సమయానికే సర్వర్ సక్రమంగా పనిచేయకపోవటంతో పంపిణీ ఆలస్యంగా జరిగింది. ఫలితంగా లబ్ధిదారులు బారులు తీరారు. మరికొంతమంది ఎండ తీవ్రతకు తట్టుకోలేక గుంపులు గుంపులుగా చెట్లను ఆశ్రయించారు. కొంతమంది మాస్కులు ధరించకుండా రేషన్ దుకాణాల వద్దకు వచ్చారు. కొన్నిచోట్ల చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు అందుబాటులో లేవు. మేడికొండూరు మండలంలోని ఆరో నెంబర్ చౌక ధరల దుకాణానికి బియ్యం సరఫరా కాకపోవటంతో పంపిణీ జరగలేదు. 18వ నంబర్ దుకాణంలో లబ్ధిదారులకు సరిపడా బియ్యం లేకపోవటంతో పూర్తిస్థాయిలో అందించలేకపోయారు.
రేషన్ సరకుల పంపిణీలో ఇబ్బందులు
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో జరిగిన మూడో విడత బియ్యం పంపిణీ కార్యక్రమంలో జాప్యం జరిగింది. కొద్ది సమయానికే సర్వర్ పనిచేయకటపోవటంతో డీలర్ల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. మేడికొండూరు మండంలోని పలుచోట్ల పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు.
ప్రభుత్వం మూడో విడత బియ్యం పంపిణీ కార్యక్రమం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో ప్రారంభమైంది. అయితే కొద్ది సమయానికే సర్వర్ సక్రమంగా పనిచేయకపోవటంతో పంపిణీ ఆలస్యంగా జరిగింది. ఫలితంగా లబ్ధిదారులు బారులు తీరారు. మరికొంతమంది ఎండ తీవ్రతకు తట్టుకోలేక గుంపులు గుంపులుగా చెట్లను ఆశ్రయించారు. కొంతమంది మాస్కులు ధరించకుండా రేషన్ దుకాణాల వద్దకు వచ్చారు. కొన్నిచోట్ల చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు అందుబాటులో లేవు. మేడికొండూరు మండలంలోని ఆరో నెంబర్ చౌక ధరల దుకాణానికి బియ్యం సరఫరా కాకపోవటంతో పంపిణీ జరగలేదు. 18వ నంబర్ దుకాణంలో లబ్ధిదారులకు సరిపడా బియ్యం లేకపోవటంతో పూర్తిస్థాయిలో అందించలేకపోయారు.
ఇదీ చూడండి: బయోమెట్రిక్... వేలిముద్రలు వేసేందుకు జనం వెనుకంజ