ETV Bharat / state

rape accused arrest: బాలికతో వ్యభిచారం కేసులో మరో అయిదుగురి అరెస్టు

rape accused arrest:బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో మరో అయిదుగురిని గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో వైకాపాకు చెందిన ఓ మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు కన్నా భూశంకరరావు ఉన్నాడు.

నిందితుడు భూశంకర్ రావు
నిందితుడు భూశంకర్ రావు
author img

By

Published : Jan 27, 2022, 6:58 AM IST

rape accused arrest: బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో మరో అయిదుగురిని గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో వైకాపాకు చెందిన ఓ మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు కన్నా భూశంకరరావు ఉన్నాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరోనా బారిన పడటంతో ఆ బాలికతో పాటు ఆమె తల్లి గతేడాది జూన్‌లో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. అప్పటి నుంచి ఆ బాలిక బాగోగులు తండ్రి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో పరిచయమైన ఓ మహిళ కరోనా పూర్తిగా నయమయ్యేందుకు నాటు వైద్యం చేయిస్తానని ఆ బాలిక తండ్రికి మాయమాటలు చెప్పి నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన తండ్రి తన కుమార్తెను ఆ మహిళ వెంట పంపారు. కరోనా తగ్గిపోయాక సదరు మహిళ ఆ బాలికను వ్యభిచారంలోకి దింపింది.

గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, కాకినాడ తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లి వ్యభిచారం చేయించింది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి తప్పించుకున్న బాలిక పేరేచర్లలో ఉంటున్న తన తండ్రి వద్దకు చేరుకుని మేడికొండూరు ఠాణాలో ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు అరండల్‌పేటకు కేసు బదిలీ చేశారు. బాలికను పోలీసులు విచారించడంతో ఈ రాకెట్లో మొత్తం 45 మందికి పైగా ఉన్నట్లు తేలింది. అలాగే రిమాండ్‌ రిపోర్టులో కొందరి పేర్లే ఉన్నాయని, అందరి పేర్లు లేవని ఆ బాలిక న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. దీంతో వ్యభిచార నిర్వాహకులు, విటులను కూడా అరెస్టు చేయాలని జడ్జి ఆదేశించారు. ఇందులో భాగంగా నిజాంపట్నంకు చెందిన భూ శంకరరావు, వ్యభిచారం నిర్వహిస్తున్నందుకు కాకినాడకు చెందిన సింహాచలం, విటులు క్రాంతికుమార్‌, శివరామకృష్ణ, నాగిరెడ్డి శివను అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 36 మందిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.

భూశంకరరావు వైకాపా ఎంపీ అనుచరుడే: లోకేశ్‌

ఎన్ని నేరాలు చేసినా తమ అధినేత జగన్‌రెడ్డి కాపాడతారనే ధైర్యంతో వైకాపా వాళ్లు చేస్తున్న అకృత్యాలకు అంతే లేకుండా పోతోందని పేర్కొంటూ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌లో ధ్వజమెత్తారు. గుంటూరులో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన భూశంకరరావు వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ అనుచరుడేనని పేర్కొంటూ బుధవారం ట్వీట్‌ చేశారు. ‘‘యథా లీడర్‌... తథా కేడర్‌ అన్నట్లుంది వైకాపా పరిస్థితి. పాలకులే నేరగాళ్లయితే వాళ్ల అనుచరులు పాల్పడే ఘోరాలకు అంతులేదని మోపిదేవి రైట్‌ హ్యండ్‌ భూశంకరరావు నిరూపించాడు....’’ అని లోకేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. సీఎం జగన్‌, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణతో భూశంకరరావు ఉన్న చిత్రాన్ని లోకేశ్‌ తన ట్వీట్‌కు జత చేశారు.

ఇదీ చదవండి:

రూ.5,375 కోట్లు సర్దుబాటే..!

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.