అమరజవాన్ల కుటుంబాలను పరామర్శించేందుకు రాజస్థాన్ 15వ ఇంజినీరింగ్ రెజిమెంట్ సైనికులు చేస్తోన్న సైకిల్ యాత్ర గుంటూరు జిల్లాకు చేరుకుంది. నిజాంపట్నం, నగరం మండలాల్లోని సైనిక గ్రామాలైన బావాజీపాలెం, మట్లపూడి గ్రామాల్లో సైనికులు పర్యటించారు. అమరులైన జవాన్ల కుటుంబాలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సైన్యంలో చేరేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. గతంలో జరిగిన యుద్ధాల్లో గాయపడిన వారిని, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. మాజీ సైనికులతో మాట్లాడిన వారు విధి నిర్వహణలో ఎదురైన సంఘటనలు, అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ సుమారు 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు రాజస్థాన్ రెజిమెంట్ సైనికులు వివరించారు.
ఇదీ చదవండి: